కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో మూడో రోజు కూడా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇలా వరుసగా మూడో రోజు కూడా రాహుల్ ను ఈడీ విచారిస్తుండటంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం వద్ద టైర్లను కాల్చేసి, నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నిరసనను అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పార్టీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకు రావడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్య్తక్తం చేసింది. కేంద్రంలో వున్నది నియంతలు అంటూ కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఓ నియంతా… ప్రజాస్వామ్య పీఠం నుంచి దిగిపో.. ప్రజల ముందుకు రావాలి అంటూ కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేశారు.
మరోవైపు నిరసనలో భాగంగా కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ తో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ.. నిరసన చేయడానికి వచ్చిన పైలట్ ను పోలీసులు నిలువరించారు. ఢిల్లీ పోలీసులు బీజేపీ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. బలవంతంగా పోలీసులు కాంగ్రెస్ కార్యాలయంలోకి రావడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని అన్నారు. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిజం విధానాలను చూస్తున్నారని ఖర్గే ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
https://twitter.com/INCIndia/status/1537023360034656258?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1537023360034656258%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Frahul-gandhi-ed-case-day-3-live-updates-national-herald-case-money-laundering-1962532-2022-06-15