చెల్లి కాపురాన్ని నిలబెట్టేందుకు అన్న మరోసారి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఏపీలో న్యాయం దొరకడం లేదని మరోసారి రిక్షాలో ఢిల్లీకి పయనమయ్యాడు. సుప్రీంకోర్టులో, హెచ్చార్సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఢిల్లీకి రిక్షా యాత్రను మన్నెగూడెం నుంచే దుర్గారావు ప్రారంభించాడు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నాగదుర్గారావు గతంలోనూ ఇదే పని చేశాడు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి, కుమిలిపోయిన ఆ అన్న ఎడ్లబండిపై ఢిల్లీకి బయల్దేరాడు. మార్గమధ్యంలోనే ఏపీ పోలీసులు వచ్చి, తాము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని రోజులు గడచినా.. పోలీసుల నుంచి ఎలాంటి న్యాయమూ జరగకపోవడంతో ఆ యువకుడు ఈ సారి రిక్షాతో ఢిల్లీకి పయనమయ్యాడు. ఈసారి అయినా… ఆ అన్నకు న్యాయం దక్కుతుందా? లేదంటే ఎప్పటి లాగే పోలీసులు వస్తారా? అన్నది చూడాలి.