రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ నెల 17 న విడుదలకు సిద్ధమవుతోంది. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్న రానా తప్పకుండా విజయం సాధిస్తాడని అన్నారు హీరో వెంకటేశ్. ఈ సినిమాలో నటించినందుకు గాను సాయి పల్లవికి జాతీయ అవార్డ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకటేశ్. విరాటం పర్వం లాంటి సినిమాలను తెలుగు తెరపైనే చూసేందుకు ఇష్టపడతానని అన్నాడు. రానా తన మొదటి సినిమా లీడర్ నుంచి ఇప్పటి దాకా ప్రతి సినిమాలోనూ పూర్తి ప్రయత్నంతోనే నటించాడనని అన్నారు.ప్రతి పాత్రకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాడని కితాబునిచ్చాడు.

ఇక రానా మాట్లాడుతూ.. దర్శకుడు నిజాయితీగా చిత్రాన్ని రూపకల్పన చేశాడన్నాడు. సాయి పల్లవి లేకుంటే ఈ సినిమాయే ఉండేది కాదన్నాడు. ప్రధాన పాత్రల్లో మహిళలే నటించారని, ఇది మహిళల సినిమా అని అన్నాడు. ఇక నుంచి సినిమాల్లో ప్రయోగాలు ఆపేసి, అభిమానులకు నచ్చే సినిమాల్లోనే నటిస్తానని సంచలన ప్రకటన చేశాడు. రాం చరణ్ ఫ్లైట్ మిస్సై, ఈవెంట్ కు రాలేదని, అందుకు చరణ్ అభిమానులకు సారీ చెబుతున్నట్లు రానా ప్రకటించాడు.