పంజాబ్ లోని బఠిండా సైనిక శిబిరంపై కాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారు ఝామున 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్ లోకి ఆగంతకులు ప్రవేశించి, కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల వెనుక ఉగ్రకోణం వున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితులను గుర్తించేందుకు క్విక్ యాక్షన్ దళాలు రంగంలోకి దిగి, వేట కొనసాగిస్తున్నాయి. దుండగులను గుర్తించేందుకు మిలటరీ స్టేషన్ ప్రాంతం మొత్తాన్ని సీజ్ చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. అయితే.. రెండు రోజుల క్రితం 28 కాట్రిడ్జ్ లతో వుండే ఓ రైఫిల్ కనిపించకుండా పోయింది. ఈ ఘటన వెనుక ఆర్మీ సిబ్బంది హస్తం వుండి వుండొచ్చని పంజాబ్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.