రాష్ట్రంలో 46 కోట్ల వ్యయంతో గన్నవరంలోని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంస్థ ఈధ్వర్యంలో వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పనులకు శ్రీకారం చేట్టారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు కూడా భూమిపూజలో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ విత్తన పరిశోధన కేంద్రం జాతీయ స్థాయిలో వారణాసిలో మాత్రమే వుందని వ్యవసాయ మంత్రి కాకాణి పేర్కొన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సీఎం జగన్ సంకల్పించడం రైతుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కేంద్రాన్ని యేడాది లోపు పూర్తిచేసి, రైతులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి రోజా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన, అన్ని వాతావరణాలను తట్టుకొని మంచి దిగుబడులిచ్చే విత్తనాలను సరఫరా చేసే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగేలా, అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల విత్తనాలను రూపొందించడంలో, సంకర జాతులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ఈ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి విత్తన జన్యు బ్యాంక్, సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, విత్తనాలు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మించనుంది. రైతుల కోసం నింగ్ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లొమా చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగు వేసే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు నింగ్ సెంటర్, హాస్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.