అమెరికాలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించారు. ఈ వార్త ఒక్కసారిగా సంచలనం రేగింది. శాన్ ఆంటోనియోలో ట్రాక్టర్ ట్రైలర్ లో 46 మంది వలసవాదులు చనిపోయారని అధికారులు ప్రకటించారు. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కంటైనర్ లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతూ. దాహంతో కేకలు వేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
వీరంతా మెక్సికో సరిహద్దు మీదుగా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు కంటైనర్ లో దాక్కొని వచ్చిన వలస కార్మికులని తెలుస్తోంది. అయితే.. విషాదం ఏమిటంటే.. తలుపులు మూసి వున్న కంటైనర్ లో ఏసీ లేదని, అందులో ఉన్న ఫ్రిజ్ లో నీటి చుక్క కూడా లేదని తెలుస్తోంది. దీంతో దాహం, ఆకలితో అలమటించి దుర్భర పరిస్థితిలో మరణించారని భావిస్తున్నారు.
టెక్సాస్ లోని శాన్ ఆంటోనియా పట్టణ శివారుల్లో రోడ్డు పక్కన వున్న ట్రక్కు నుంచి అకస్మాత్తుగా అరుపులు, కేకలు వినిపించాయి. కాపాడండి.. కాపాడండి.. అంటూ ట్రక్కు నుంచి ఆర్తనాదాలు వచ్చాయి. దీంతో మూసి వున్న ట్రక్కు కంటైనర్ లోకి ఓ వ్యక్తి తొంగి చూడటంతో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి తలుపులు తీసి చూసే సరికి 46 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని తరలించారు.