జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఐటీబీపీ జవాన్లను తీసుకెళ్తున్న బస్సు పహల్గామ్ నదిలో పడిపోయింది. దీంతో ఆరుగురు సైనికులు మృతిచెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం అనంతనాగ్ లోని ప్రభుత్వాసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ ద్వారా అధికారులు తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో ఈ బస్సులో 37 మంది ఐటీబీపీ జవాన్లు, ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు కూడా వున్నారు. అయితే… అమర్ నాథ్ యాత్ర బందోబస్తును ముగించుకొని, ఈ జవాన్లు చందన్ వారీ నుంచి పహల్గామ్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
