మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి.
పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి
శుభవార్త వింటారు. సంకల్పబలంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మంచి సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. డబ్బు
జాగ్రత్త.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆకస్మిక ధన లాభం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రోజంతా
ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది.
వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో
విహారయాత్ర చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన పనుల్లో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి.
కొందరు బంధువులు వల్ల చికాకులు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ
సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు
చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో
బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతకు, సంతోషానికి లోటుండదు.
కొద్ది శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధువులకు కొద్దిగా సహాయం
చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర1)
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి
ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చాలాకాలంగా
ఎదురుచూస్తున్న పని ఒకటి అనుకోకుండా పూర్తవుతుంది. శుభవార్త వింటారు.
నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం
కుదురుతుంది. స్పెక్యులేషన్ జోలికి పోవద్దు.
కన్య(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంది.
పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది
కానీ, అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు
రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తుల(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద ముఖ్యమైన
పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగా శ్రమ పెరుగుతుంది. మీకు
రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో
ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు
తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే
మున్ముందు కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఇంటా
బయటా ఒత్తిడిలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు తగ్గి ఖర్చులు
పెరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక
లావాదేవీలు పెట్టుకోవద్దు.
ధనుస్సు(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది కానీ కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది.
కొన్ని సమస్యలు చికాకు పెడతాయి. వ్యాపార పరంగా కొద్దిగా అప్రమత్తంగా
ఉండాల్సిన అవసరం ఉంది. సామాజిక సేవలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది.
ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి.
వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్చిక పరిస్థితి కొద్దిగా మెరుగు పడుతుంది. శుభవార్త వింటారు. వృత్తి
వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం
జరగవచ్చు. ఆర్థిక లావాదేవీలు లభించవు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు
ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి.
కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. సమాజంలో
గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి
చేస్తారు. చిన్నపాటి అదృష్టం వరిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయటా శక్తికి మించి
శ్రమపడతారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యం
విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఎవరికీ హామీలు ఉండవద్దు. బంధుమిత్రులు
అండగా ఉంటారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలకు
దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.