8 యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ ఛానళ్లు నకిలీ, భారతకు వ్యతిరేకంగా కాంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 8 యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోలను చూశారని, అయితే ఆ ఛానళ్లు విద్వేషాన్ని రెచ్చగొడుతోందని, మత వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నట్లు ఐబీ శాఖ తెలిపింది. దీంట్లో ఏడు భారత్‌కు చెందినవి కాగా, మరో పాకిస్థాన్ ఛానల్ ఉంది. దీంతో గడ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు బ్లాక్ చేసిన ఛానళ్ల సంఖ్య 102కు చేరుకున్నది.
