Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మంచి సినిమా బ్యూటీ ఫుల్ గర్ల్

నీహాల్‌ కోదాటి, ద్రిషిక చందర్‌ జంటగా నటిస్తున్న సినిమా బ్యూటిఫుల్‌ గర్ల్‌. జన్‌ నెక్ట్‌ మూవీస్‌ పతాకంపై ప్రసాద్‌ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు నిర్మిస్తున్నారు. రవిప్రకాష్‌ బోయపాటి దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ బాగుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అని అన్నారు. ఈ సంస్థలో  బటర్‌ఫ్లై అనే చిత్రంలో నటించాను అన్నారు. ద్శకుడు రవిప్రకాష్‌ బోడపాటి మాట్లాడుతూ మంచి కథల్ని తెరకెక్కించేందుకు ఈ టీమ్‌ ప్రయత్నిస్తుంటుంది. ఈ చిత్రం కూడా అలాంటి మంచి సినిమా అవుతుంది అని చెప్పింది. ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో ఓటీటీలో విడుదల చేయబోతున్నాం. ఆకట్టుకునేలా ఒక అందమైన అమ్మాయి కథను తెరకెక్కించాం. ఇందులో వర్క్‌ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ కొత్త వారైనా చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు అని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత ప్రసాద్‌ తిరువల్లూరి, హీరో నిహాల్‌ కోదాటి, హీరోయిన్‌ ద్రిషిక చందర్‌, హర్విజ్‌, సతీష్‌ గంట తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates