Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఐఐసీటీ సైంటిస్ట్ రామానుజ నారాయణ్ కు అరుదైన గౌరవం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్‌ రామానుజ నారాయణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్‌ టెక్నాలజీకి (ఐఎంఎంటీ) ఆయన డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. 2008లో ఐఐసీటీలో విధుల్లో చేరిన ఆయన ఇప్పటివరకు వివిధ హోదాల్లో కెమికల్‌ రంగంలో సేవలందించారు. ఐపీఏ అవార్డుతో పాటు ఐఐసీటీ గౌరవ్‌ సమ్మాన్‌ అవార్డునూ ఆయన దకించుకున్నారు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌, పాలిమర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఆయిల్‌ టెక్నాలజిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థల్లో ఆయన సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఈ పదవిలో ఆరేండ్ల పాటు సేవలందించనున్నారు.

Related Posts

Latest News Updates