Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పంజాప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పంజాబ్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో, బడి పిల్లల మాదిరిగానే, ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట ఆఫర్‌ ప్రకటించింది. వచ్చేనెల నుంచి ఉద్యోగులను ఒంటిపూట విధులకు పరిమితం చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. మే 2నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 వరకు ఈ కొత్త పనివేళలు అమలులో ఉంటాయి అని సీఎం మాన్‌ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిపుణులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి చేరుకుంటానని సీఎం చెప్పారు.

Related Posts

Latest News Updates