Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రివ్యూ: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’! చెప్పడానికి గొప్పగా ఏమి లేదు….!

ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ 2.5/5

నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్,
నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.
సంగీతం: వివేక్ సాగర్
పాటలు : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
సినిమాటోగ్రఫీ : పీజీ విందా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
సమర్పణ: గాజులపల్లె సుధీర్ బాబు
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: 16.09.2022’సమ్మోహనం’ సినిమాతో ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబులు కలిసి… ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం. మరి ఈరోజు శుక్రవారం థియేటర్స్ లోకి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

 కథ :  
నవీన్ ( సుధీర్ )బాబు సినీ ఇండస్ట్రీ లో ఓ యంగ్ హిట్ డైరెక్టర్ కాగా తాను సినిమా చెయ్యడానికి ఓ సరైన హీరోయిన్ కోసం చూస్తూ ఉంటాడు. దీనితో ఈ వేటలో ఓ డాక్టర్ అయినటువంటి అలేఖ్య (కృతి శెట్టి) నుంచి ఓ వీడియో చూసి అమితంగా ఇంప్రెస్ అవుతాడు. అక్కడ నుంచి ఆమెని హీరోయిన్ గా పెట్టి తన సినిమా చెయ్యాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఆమెకు, ఆమె కుటుంబానికి సినిమాలన్నా పడదు. ఆమడ దూరంలో ఉంటూనే అసహ్యించుకుంటారు. మరి ఆమెతో తాను సినిమా చేస్తే ఎలా ఒప్పించి చేస్తాడు? ఈ ప్రపోజల్ కి అలేఖ్య కుటుంబం ఏం చెప్తారు? ఆమె ఎలా కన్విన్స్ అవుతుంది? ఈ సినిమా వల్ల ఆమెకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? దానికి గల కారణం ఏంటి? చివరకు నవీన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాడా? సినిమాలంటే ఇష్టంలేని అమ్మాయి.. చివరకు ఎందుకు సినిమాలో నటించిందా? అనేది తెరపై చూడాల్సిందే.నటి నటుల హావభావాలు:
సుధీర్ బాబు ఇలాంటి సాఫ్ట్ రోల్స్‌కు బాగా నప్పుతాడు. సమ్మోహనంలో సెటిల్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా సుధీర్ ఈ చిత్రంలోనూ చక్కగా నటించాడు. సినిమా డైరెక్టర్ గా నవీన్ పాత్రలో సుధీర్ బాబు ఎమోషన్స్ పలికించాడు. ఇక కృతి శెట్టికి మళ్లీ ఓ రొటిన్ కథ పడ్డట్టు అనిపించింది. అవే లుక్స్, అవే ఎమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు అయింది. ఇందులో వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్వులు పూయించాడు. రాహుల్ రామకృష్ణ మరీ అతిథి పాత్రలా అనిపిస్తాడు. శ్రీకాంత్ అయ్యంగార్ తనకు అలవాటైన రీతిలో నటించేశాడు. మిగిలిన పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :  
ఇక టెక్నికల్ టీం లోకి వస్తే….దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తాను మరో డీసెంట్ సబ్జెక్ట్ తో వచ్చారని చెప్పాలి. పాత్రధారులకి మంచి రోల్స్ డిజైన్ చేసి వారి నుంచి మంచి నటనను కూడా తాను రాబట్టారు. ఇంకా డీసెంట్ ఎమోషన్స్, కాస్త స్లో అనిపించినా మంచి నరేషన్ తోనే సినిమాని చూడొచ్చు అనే రేంజ్ లో డిజైన్ చేశారు. ఇంద్రగంటి సినిమాలపై ఓ మార్క్ ఉంటుంది. హస్యాన్ని కూడా ఎంతో సున్నితంగా పండిస్తుంటారు. అశ్లీలతకు తావివ్వడు. కమర్షియల్ జోలికి వెళ్లడు. కానీ ఈ కథలో మాత్రం కాస్త తన బార్డర్లను తానే చెరిపేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఐటం సాంగ్‌ను కూడా పెట్టేశాడు. సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని అందులో జరిగే వాటిపై సీరియల్ కథలు వచ్చాయి.. కామెడీ కథలు కూడా వచ్చాయి. ఇంద్రగంటి సైతం అలాంటి ఓ కథనే ఎంచుకున్నాడు. అంతర్లీనంగా క్యాస్టింగ్ కౌచ్ వంటి వాటి మీద కూడా తన అభిప్రాయాన్ని చెప్పినట్టు కనిపిస్తుంది. ఇండస్ట్రీలోని కొన్ని వ్యవహారాలు, మీడియా రాసే గాసిప్పులు, వాటి వల్ల సెలెబ్రిటీల ఫ్యామిలీలపై పడే ప్రభావాన్ని కూడా అలా చూపించేసినట్టు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆడియెన్స్ మీద వేసిన ఓ డైలాగ్ బాగుంటుంది. ఆడియెన్స్ ఎంత మంచివారో.. చెత్తలోంచి కూడా మంచిని తీసుకుంటున్నారు.. అని సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ బాగుంటుంది. కలను చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టే అన్న డైలాగ్ కూడా బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సినిమాకి ప్రాణం పోసాడు. ఈ తరహా చిత్రాలకు ఒక సోల్ లాంటి మ్యూజిక్ తాను ఇస్తాడు అలాగే ఈ కాంబోలో మరోసారి మంచి మ్యూజిక్ ని అయితే తాను అందించాడు. అలాగే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా అయితే తన వర్క్ ఈ సినిమాకి బాగుంది. ఈ సినిమాలో బెంచ్ మార్క్ స్టూడియోస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.సినిమా కథకు తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా చేశారు.

విశ్లేషణ:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, సుధీర్ బాబు మరియు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుంచి మరో సెన్సిబుల్ రొమాంటిక్ డ్రామా అని చెప్పాలి. సమ్మోహనం తర్వాత మరో క్లీన్ లైన్ తో డీసెంట్ డ్రామాలా ఈ సినిమా కనిపిస్తుంది. ఇక మెయిన్ లీడ్ అయితే తన పెర్ఫార్మన్స్ కెమిస్ట్రీ లతో డెఫినెట్ గా ఇంప్రెస్ చేస్తారు. అయితే స్లోగా సాగే నరేషన్, కొన్ని రొటీన్ అనిపించే సీన్స్, సినిమా నిడివి లాంటివి కాస్త బోర్ కలిగిస్తాయి. వీటితో కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే ఈ సినిమా బెటర్ గా అనిపిస్తుంది. అయితే ఈ కథ, కథనాలు మాత్రం ఎక్కడాా అంత ఆసక్తికరంగా అనిపించదు. మరీ స్లోగా ఉన్నట్టు కనిపిస్తుంది. కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. అలాగే మరీ అంత థ్రిల్ చేసేసే ట్విస్ట్ లు కూడా సినిమాలో పెద్దగా ఉండవు దీనితో సినిమా అంతా అలా ఫ్లాట్ గా కొనసాగిపోతుంది. చిత్రం గురించి చెప్పడానికి అంత గొప్పగా ఏమిలేదు.

Related Posts

Latest News Updates