రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు యశ్వంత్ సిన్హాకే వుంటుందని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థి ముర్ముపై తమకు అపార గౌరవం వుంది కానీ…. తమ మద్దతు మాత్రం యశ్వంత్ సిన్హాకేనని ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఎవరికి మద్దతిచ్చే విషయమై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన ఓ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లోనే యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 18 న జరుగుతున్నాయి. 21 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ, బీజేపీ, బీజేడీ, శివసేన, టీడీపీ, అకాలీదళ్ లాంటి పార్టీలు మద్దతివ్వడంతో 50 శాతం మద్దతు ఇప్పటికే లభించినట్లైంది.
AAP के राष्ट्रीय संयोजक व दिल्ली के मा.मुख्यमंत्री @ArvindKejriwal जी की अध्यक्षता में पार्टी PAC की बैठक हुई।
PAC ने राष्ट्रपति चुनाव में विपक्ष के उम्मीदवार श्री यशवंत सिन्हा जी का समर्थन करने का निर्णय लिया है।
हम श्रीमती द्रोपदी मुर्मू का भी सम्मान करते हैं। pic.twitter.com/ViZAUw82QS— Sanjay Singh AAP (@SanjayAzadSln) July 16, 2022