పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపు తప్పి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని 6 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా జరిగింది. ఈ ఘటనలో రేవంత్ రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 మీడియా కార్లు దెబ్బతిన్నాయి. అయితే.. కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. పలువురు రిపోర్టర్లకు గాయాలయ్యాయి. ఎవరి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం రేవంత్ వేరే కారులో శ్రీపాద ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్లారు.
