సినీ నటులు నరేష్- పవిత్ర వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే దీనికి హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే… ఎక్కడ జరిగిందో చెప్పలేదు కానీ… దీనికి సంబంధించిన వీడియోను మాత్రం నరేష్ విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అందరి ఆశీస్సులూ కోరారు. ఈ కొత్త ప్రయాణం శాంతి, సంతోషాలతో సాగాలని మీ ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్లు, ఏడు అడుగులు… మీ ఆశీస్సులు కోరుకుంటూ అంటూ నరేష్ ట్వీట్ చేశారు. కొన్నాళ్లుగా నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకుంటారనే దానిపై నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వివాదం కూడ ఆకొనసాగుతుంది. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లిపై గొడవ చేస్తోన్న సంగతి తెలిసిందే.
