Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పాల్గొన్న నటి శ్రీలీలా

గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు హస్పెటాలిటీ లో నటి శ్రీలీలా మొక్కలు నాటడం జరిగింది.రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీలీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీలా తెలిపారు.

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిపి ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీలా తెలిపారు. ప్రతిఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ గారికి శ్రీలీలా కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీలా పిలుపు ఇచ్చారు.

Related Posts

Latest News Updates