టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరవింద సమేత హిట్ అవ్వడంతో కెరీర్ మొత్తం మారిపోయింది. ఆచార్య, బీస్ట్, రాధశ్యామ్ చిత్రాలతో జబర్దస్త్ పేరు తెచ్చుకుంది. అయితే.. అంతకు ముందు ఆమెది ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీలో తెగ ప్రచారం జరిగింది. ప్రతి సినిమా ప్లాఫ్ అవడంతో ఈ ప్రచారం మరింత జరిగింది. అయితే అమ్మడి రేంజ్ మాత్రం మారలేదు. అరవింద సమేత తర్వాత గోల్డెన్ లెగ్ అంటూ అంతే ప్రచారం జరిగింది.
అయితే ఒకే ఒక్క సినిమా తన కొంపలు ముంచిందని, అదో చెత్త సినిమా అంటూ పూజ హెగ్డే చిందులు వేసింది. ఆ సినిమాలో నటించే అవకాశాలు పోగొట్టుకున్నానని వాపోయింది. ఆ సినిమా పేరే డెబ్యూ మొహంజోదారో. స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించడంతో తెగ ఆనందపడిపోయింది. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది.
అయితే… ఇదంతా పూజా హెగ్గే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే.. వరుసగా నటించిన 6 సినిమాలు మాత్రం హిట్ అయ్యాయని, తన కెరీర్ లో అదే బిగ్ అచీవ్ మెంట్ అంటూ తెగ సంతోషపడింది. లోయెస్ట్ పాయింట్ మాత్రం మొహంజోదారో అంటూ పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.