తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు బాలివుడ్ లో కూడా వరుస సినిమాల్లో బిజీగా వుంది రష్మికా. సినిమాల్లో ఎంత బిజీగా వున్నా.. రష్మిక సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా వుంటారు. తనకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే వుంటుంది. అయితే ఈ మధ్య రష్మిక విషయంలో సోషల్ మీడియాలో ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. అది తన పెట్ టాగ్ విషయంలో. ఏ రంగంలో వున్న సెలెబ్రెటీలు అయినా.. దేశ, విదేశాలకు వెళ్లే సమయంలో తమ వెంట తమ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు.
ఒక్కో సారి వాటికి సెలెబ్రెటీలే ఖర్చులు భరిస్తుంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు అయితే.. ఆహ్వానించిన వారిని ఆ ఖర్చులు భరించమంటారు. ఇదో ఆనవాయితీ. రష్మిక పెట్ డాగ్ ‘ఆరా’ కోసం నిర్మాతల్ని టికెట్ వేయమని డిమాండ్ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరా లేకుంటే తనకు కష్టమని, ఆరాకు కూడా ఓ టిక్కెట్ బుక్ చేయాలని డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలపైనే రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
మీ వార్తలు భలే సిల్లీగా వున్నాయి. ఆరా నాతో విమానంలో ప్రయాణించాలని మీరు కోరుకున్నా.. ఆ కోరిక ‘ఆరా’కు అస్సలే లేదు. హైదరాబాద్ లోనే హాయిగా వుంటోంది. తెగ సంతోషంగా వుంది. మీరెంతో శ్రమించారు. ధన్యవాదాలు అంటూ రష్మిక ట్విట్టర్ వేదికగా చురకలంటించింది.
https://twitter.com/iamRashmika/status/1540297494869200896?s=20&t=Aa4ag7YeBsf91K0rv8Xc3g