నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికలు. రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్ కథతో రానున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని అందిరిందే పాటని విడుదల చేశారు. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, సంజిత్ హెగ్డే ఆలపించారు. అదిరిందే పాటకి మంచి స్పందన లభిస్తోంది. పాటలో నితిన్, కృతిశెట్టిల మధ్య కెమిస్ట్రీ, వాళ్ల నృత్యాలు ఆకట్టుకునేలా ఉంటాయని సినీ వర్గాలు తెలిపాయి. మాస్‌తో పాటు, వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
