కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తన పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. చండూర్ సభలో ఎంపీ వెంకట్ రెడ్డిని ఉద్దేశించి.. అద్దంకి దయాకర్ అసభ్య పదాలను ఉపయోగించారు. వాడుక భాషలో ఆ పదాలు వచ్చాయని, తప్పు జరిగిందని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పదాలు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటానని హామీ ఒచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మనోభావాలు గనక దెబ్బతిని వుంటే… వ్యక్తిగతంగా తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.
నాయకుల వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. అయితే.. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వర్గంతో పాటు మరికొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే…. తాము నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేస్తామని హెచ్చరించారు. అయితే… తనకు పీసీసీ నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయని, అక్కడ కూడా ఇవే వ్యాఖ్యలు చెబుతానని, తాను నోరుజారానని తెలిపారు.