రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్. కృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తన్హాజీ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు రూ.100 కోట్లు పలికాయట. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ థియేట్రికల్ హక్కులను దర్కించుకుందట. టాలీవుడ్ సినీ చరిత్రలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఏకైక సినిమా ఆదిపురుష్ నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.