జమ్ముకశ్మీర్‌లో భారీ సొరంగం (టన్నెల్) బయటపడింది. అంతర్జాతీయ సరిహద్దుకు కొన్ని అడుగుల దూరంలో దీన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించారు. సరిహద్దులో పాక్ నుంచి భారత్‌లోకి ప్రవేశించేలా దీన్ని తవ్వారు. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు అడ్డంకులు సృష్టించడానికి, భక్తులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఈ సొరంగాన్ని తవ్వినట్టు అధికారులు చెప్పారు. ఈ సొరంగం ఇటీవలే తవ్వినట్టు ఉన్నదని, దీని ముఖద్వారం పాక్ భూభాగం వైపు ఉన్నదని తెలిపారు. ఉగ్రవాదుల పన్నాగాలను దృష్టిలో ఉంచుకొని అమర్‌నాథ్ యాత్రకు గట్టి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
