తెలంగాణలో వరుసగా వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో రకరకాల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని లెక్కలు తేల్చారు. ప్రధానంగా ఈ నష్టాలు వర్షాలు ఎక్కువగా కురిసిన ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే వున్నాయని పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టినా… పంట భూములు ఇంకా నీటిలోనే వుండిపోయాయి. అనేక గ్రామాలకు కరెంట్ ను ఇంకా పునరుద్ధరించలేదు.
రోడ్లను కూడా బాగు చేయలేదు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ యేడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని, టార్గెట్ పెట్టుకోగా… 53.79 లక్సల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. ఈ భారీ వర్షాల కారణంగా పత్తి, సోయాబిన్ పంటలే దెబ్బతిన్నాయని, వాటికే ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.