సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగింది. 6 సవర్ల బంగారం, వజ్రపు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.దీంతో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. తన దగ్గర పని చేస్తున్న ముగ్గురి పేరుని ఆ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేనాం పేట పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు..
డైమండ్ సెట్, ఆలయ ఆభరణాలలో అన్‌కట్ డైమండ్స్, నవరత్నం సెట్లు, పురాతన బంగారు ముక్కలు, వజ్రాలతో కూడిన రెండు నెక్ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, హారమ్ నెక్లెస్, 3.6 లక్షల విలువ చేసే సుమారు 60 సవర్ల బ్యాంగిల్స్ ఉన్నాయని ఫిర్యాదులో ఐశ్వర్య తెలిపారు. 2019 లో ఓ పెళ్లి సందర్భంగా వాటిని వాడానని, ఆ తర్వాత లాకర్ లో పెట్టి తాళం వేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్పటి నుంచి మూడు సార్లు ఇళ్లు మారినప్పటికీ ఇంతవరకు ఆ లాకర్‌ని తెరవలేదని ఫిర్యాదులో ఆమె చెప్పుకొచ్చారు.