కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అలాగే బీజేపీకి ఊహించని మద్దతు లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. ఈ గుడ్ బై చెప్పేయడానికి కారణంగా ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటే. బీబీసీ ప్రధాని మోదీపై డాక్యుమెంట్ తయారు చేయడాన్ని అనిల్ ఆంటోనీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమే అవుతుందంటూ ఫైర్ అయ్యారు. అలాగే… మోదీపై బీబీసీ చేసిన డాక్యుమెంట్ పై కాంగ్రెస్ చేసిన ట్వీట్ ను కూడా ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నానని ట్వీట్ చేశారు. పార్టీ విధానం సరైంది కాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీబీసీ డాక్యుమెంటరీ దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమే అని మండిపడ్డారు. అలాగే గుజరాత్ అల్లర్లపై బీబీసీ చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని కేరళ పీసీసీ ప్రకటించడాన్నికూడా ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు. అయితే.. దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఏకే ఆంటోనీ కూడా ఏమీ స్పందించలేదు.
ఏకే ఆంటోనీ పార్టీలో చాలా సీనియర్. కాంగ్రెస్ కి, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు పొందారు. మొన్నటికి మొన్న జరిగిన పార్టీ అధ్యక్షుడి జాబితాలోనూ ఏకే ఆంటోనీ పేరు ప్రముఖంగా వినిపించింది. సోనియా గాంధీకి గానీ, రాహుల్ కి గానీ అత్యంత విధేయుడు. అలాంటి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేయడంతో పార్టీలో దుమారం రేగింది. అయితే.. తదుపరి ఏ పార్టీలో చేరాతారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.