దేశ రాజధానిలో సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలు, రాజకీయాలు చర్చించారు. ఇక.. అఖిలేశ్ వెంట ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ కూడా వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిద్దర్నీ శాలువా కప్పి, ఆహ్వానించారు. దాదాపు రెండు గంటల పాటు వీరు జాతీయ రాజకీయాల గురించే చర్చించుకున్నారు.
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వాటిని ఎదుర్కొనే విధానంపై చర్చించుకున్నారు. ఇక.. పార్లమెంట్ వేదికగా జరుగుతున్న పరిణామాలను కూడా వీరు చర్చించుకున్నారు. ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరు, పార్థా అరెస్ట్ లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చిన్లు సమాచారం.