అల్ ఖైదాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాని అగ్రనాయకుడు అల్ జవహరీని అమెరికా భద్రతా బలగాలు ఎట్టకేలకు మట్టుబెట్టాయి. కాబూల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్ జవహారీని హతమార్చినట్లు అమెరికా అధికారికంగా వెల్లడించింది. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ కూడా అధికారికంగా వెల్లడించారు. అయితే… ఈ ఆపరేషన్ కు బైడెన్ జూలై 25 నే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
అయితే.. అతడ్ని మాత్రమే హతం చేయాలని, వారి కుటుంబీకులను మాత్రం ఏమీ అనొద్దని బైడెన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే.. జవహరీ తన నివాసంలో వుండగా… అమెరికా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. అయితే.. ఈ మధ్యే అల్ జవహరి కుటుంబంతో కలిసి కాబూల్ కు మారినట్లు అమెరికాకు పక్కాగా సమాచారం అందింది. దీంతో బోడైన్ ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై… ఈ ఆపరేషన్ కు ప్లాన్ చేశారు. ఈ ఆపరేషన్ కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.