ప్రముఖ నటి ఆలియా భట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఓ పిక్ ను షేర్ చేసింది. తమ బేబీ త్వరలో వస్తోందంటూ రాసింది. ప్రముఖ నటుడు రణబీర్ కపూర్, ఆలియా భట్ మధ్య ఉన్న ప్రేమ బంధం పెళ్లిగా మారిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 14 న ముంబైలో వీరిద్దరి వివాహం జరిగింది. అయితే ఆలియా భట్ షేర్ చేసిన చిత్రంలో ఆమె ఆస్పత్రిలో బెడ్ పై పడుకొని వుండగా.. పక్కన వున్న మానిటర్ లో లవ్ సింబల్ కూడా వుంటుంది. పక్కనే భర్త రణబీర్ కూడా టోపీ పెట్టుకొని కనిపిస్తాడు.
Congratulations to #AliaBhatt and #RanbirKapoor who are going to become parents soon!!! ❤ pic.twitter.com/Dsg0TPWOHa
— Thyview (@Thyview) June 27, 2022