Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి సర్వం సిద్ధం.. హాజరు కానున్న 25 దేశాల ప్రతినిధులు

విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్ కీలకమైన ఒప్పందాలకు వేదికగా నిలవబోతోంది. ఇప్పటి వరకూ 1,200 మందికి పైగా పేర్లను నమోదు చేసుకున్నారు. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా, సంజీవ్ బజాజ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, గ్రంథి మల్లికార్జున రావు, సజ్జన్ భుజాంక, తదితర ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్నారు.

25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు కూడా పాల్గొంటారు. రెండు రోజుల సమ్మిట్ కోసం 12 వేల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రాష్ట్ర ఎకానమీని అభివృద్ధి చేయడం, అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. ఇక… 2,500 మంది పోలీసులతో భద్రత కల్పించనుంది ప్రభుత్వం.

 

ఇక… వచ్చే పారిశ్రామిక వేత్తల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను కూడా ఏర్పాటు చేస్తోంది. 70 శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీల కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమైపోయాయి. కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి, తదితరులు రానున్నారు. వీరి కోసం రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే ముఖేష్ అంబానీ, జిందాల్, అదానీ లాంటి పారిశ్రామికవేత్తల రవాణా సౌకర్యార్థం లగ్జరీ కార్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తంగా 800 మంది వీవీఐపీలు హాజరు కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పనులు పూర్తయ్యాయి. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలతో విశాఖ ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. మార్చి మూడు, నాలుగవ తేదీలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించి భారీ పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని ప్రణాళిక బద్దంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కార్ ప్లాన్ చేసింది.

Related Posts

Latest News Updates