Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నాంది కాంబినేషన్ అల్లరి నరేష్, విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ చిత్రానికి శ్రీకారం

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని తన సరికొత్త ఇన్నింగ్స్ నాందిగా భావించారు. వీరిద్దరూ కలిసి తమ రెండో సినిమా కోసం చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను అందజేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే ఈ చిత్రానికి ‘ఉగ్రం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆవేశంతో అరుస్తుండగా, అతని వెనుక భాగంలో కత్తిపోటు, శరీరమంతా గాయాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ‘ఉగ్రం’ టైటిల్‌ కు సరైన జస్టిఫికేషన్ ఇచ్చింది. టైటిల్ ని రెడ్ కలర్‌తో డిజైన్ చేయడం ఇంట్రస్టింగా వుంది. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రం కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఇందులో నరేష్ ని చాలా డిఫరెంట్ రోల్ లో ప్రెసెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే, తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తారాగణం: అల్లరి నరేష్
సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది బ్యానర్: షైన్ స్క్రీన్స్ కథ: తూము వెంకట్ డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: సిద్ సంగీతం: శ్రీచరణ్ పాకాల ఎడిటర్: ఛోటా కె ప్రసాద్  ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

Related Posts

Latest News Updates