పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని చూసి తాను గర్వపడుతున్నానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. గతంలో తనను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని పిలిచేవారని, తన సినిమాల గురించే మాట్లాడుకునే వారన్నారు. కానీ… ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తనను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని పరిచయం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఒక తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది? అని అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ తండ్రిగా తనకు ఇది ఎంతో గర్వకారణమన్నారు. బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇక.. తన మనుమరాలు, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా స్క్రీన్ పైకి వచ్చేసిందన్నారు. శాకుంతలం చిత్రంలో అర్హ నటించింది. తనను స్క్రీన్ పై చూసేందుకు తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.