Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పుష్ప-2 తో బిజీగా వుండగానే.. మరో ప్రాజెక్టును ఒప్పేసుకున్న అల్లు అర్జున్… అధికారికంగా ఓకే

పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బాగా బిజీ వున్నాడు. అయితే… ఆయన తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా… అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని టీ సిరీస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యనిమల్ మూవీని తెరకెక్కించే బిజీలో వుండగా…. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.

Related Posts

Latest News Updates