Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ THE RULE ప్రారంభం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ ఎక్కించిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. 350 కోట్లకు పైగా వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ అతిపెద్ద విజయంగా నిలిచింది ఈ సినిమా. సినిమా కంటే కూడా పుష్ప మేనియా ప్రపంచాన్ని ఊపేసింది. అందులోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనపై ప్రశంశల వర్షం కురిసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. కరోనా సమయంలో కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసి.. అల్లు అర్జున్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది పుష్ప. మొదటి భాగం చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్, సుకుమార్ ప్రశంశల వర్షం కురిపించారు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు సమాధానం దొరికింది. తాజాగా పుష్ప సీక్వెల్ పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే లిరిసిస్ట్: చంద్రబోస్ సీఈఓ: చెర్రీ ఛీఫ్ ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబా సాయికుమార్ మామిడ‌ప‌ల్లి బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

Related Posts

Latest News Updates