అమరనాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగానే అమరనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని అధికారులు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గావ్, బలాల్ మార్గాల్లో విపరీతమైన వర్షాల కారణంగా భక్తులను వెళ్లేందుకు అనుమతులివ్వడం లేదని అధికారులు పేర్కొన్నారు. వర్షం తగ్గేంత వరకూ ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
వర్షాలు తగ్గిన తర్వాత పరిస్థితిని ఓ సారి సమీక్షించుకుంటామని, ఆ తర్వాత తదుపరి నిర్ణయాలు వుంటాయని ఐటీబీటీ పోలీసు వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పటికే అమరనాథ్ యాత్రకు రెండు సార్లు బ్రేకులు పడ్డాయి. ఈ నెల 5,8 తారీఖుల్లో ఆకస్మికంగా వరద బీభత్సం తలెత్తడంతో అధికారులు ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.