Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అగ్నివీరులకు అభయమిచ్చిన మహీంద్రా.. బంపర్ ఆఫర్ ప్రకటన

అగ్నివీరులకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. కార్పొరేట్ సెక్టార్ లో అగ్నివీరులకు ఉపాధి అవకాశం ఉందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ స్కీమ్ కింద సైన్యంలో పనిచేసి, రిటైర్డ్ అయిన వారికి తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని సంచలన ప్రకటన చేశారు. అగ్నిపథ్ శిక్షణ పొందిన సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోందని అన్నారు. కార్పొరేట్ రంగంలో అగ్నివీర్లకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని, నాయకత్వం, టీమ్ వర్క్, శారీరక శిక్షణతో ఉంటారు కాబట్టి, వారు కార్పొరేట్ రంగానికి పనికొస్తారన్నారు.

అయితే అగ్నిపథ్ పథకంపై జరుగుతున్న హింసాత్మక ఆందోళనలపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అప్పుడూ ఇప్పుడూ అదే మాట చెబుతున్నాను. ఈ పథకంతో అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలే వారికి మంచి ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తాయి. అలా అద్భుత శిక్షణ పొందిన సమర్థులైన వారిని రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోంది అంటూ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates