నిత్యం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ వుండే ఆనంద్ మహీంద్రా.. ఈసారి ఓ కేఫ్ ను నెటిజన్లకు పరిచయం చేశాడు. దీనికి ఆయన 10 స్టార్ రేటింగ్ ఇచ్చేశాడు. ఈ కేఫ్ ను భారత ఆర్మీ నడుపుతోంది. ఇదే దీని ప్రత్యేకత. కశ్మీర్ లోని గురెజ్ వ్యాలీలో ఆర్మీ లాంగ్ హట్ పేరుతో ఈ కేఫ్ నడుస్తోంది. చుట్టూ అందమైన వాతావరణం మధ్య ఈ కేఫ్ వుంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. దీని గురించి గరిమా గోయల్ అనే బ్లాగర్ వీడియో చేశాడు.
వీడియో తీయడమే కాకుండా పదార్థాలు కూడా ఎంతో రుచిగా, శుచిగా వుంటాయని ఆమె పేర్కొన్నారు. భారత సైన్యానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ కేఫ్ ను సందర్శించాలని గరిమా గోయల్ తన వీడియోలో పిలుపునిచ్చారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఈ వీడియోను షేర్ చేశారు. నా వరకు నేను దీనిని 10 స్టార్ విడిది అంటా. 5 స్టార్, 7 స్టార్ కాదు. 10 స్టార్ విడిది అంటూ మహీంద్రా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
As far as I’m concerned, this Cafe is not a 5 star, nor a 7 star, but a 10 star destination! pic.twitter.com/oQZvEOanlT
— anand mahindra (@anandmahindra) June 11, 2022