అటు బుల్లితెరను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేయడంలో సూపర్ హిట్ అయింది అనసూయ భరద్వాజ్. అటు యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో ఆకర్షణగా నిలుస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప సినిమాలో దాక్షాయణిగా జబర్దస్త్ నటించి, మంచి పేరు సంపాదించుకుంది. ఇక.. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా ప్రత్యేకంగా నటించి, ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు నటించిన క్లాసిక్ నాటకం కన్యాశుల్కం. అందులో అన్ని పాత్రలూ అత్యంత సూపర్ హిట్. అయితే వేశ్య మధుర వాణి పాత్ర అన్నింటి కంటే సూపర్ హిట్. వేశ్య వృత్తి చేస్తున్నా… కొన్ని నియమ నిబంధనలకు లోబడే మధుర వాణి వుండేది. అచ్చు కన్యాశుల్కం కథతో డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు. ఈ సిరీస్ లోనే మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించేందుకు సిద్ధమైంది. ఇందుకు అనసూయ కూడా ఓకే చెప్పేసింది. ఈ పాత్ర ద్వారా అనసూయ మరింత ఫేమస్ కానుంది.