ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి 132 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రావణ శుద్ధ పాఢ్యమి మొదలు శ్రావణ శుద్ధ విదియ వరకు 2 రోజుల పాటు ఆలయంలో జయంత్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి వారి ప్రధాన ఆలయంలో అవినీటి మండపంలో స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ శుద్ధ విదియ స్వామి వారి ఆవిర్భావం గనక… తెల్లవారు నుంచే మూలవిరాట్లకు అభిషేకాలు చేశారు. అవినేటి మండపంలో ఆయుష్య హోమం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, వేద పారాయణం, చండీ పారాయణలు జరిగాయి. స్వామి వారిని వెండి పల్లకిలో ఊరేగిస్తూ.. ముమ్మారు ఆలయ ప్రాకార సేవ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు.