ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే, వారిని తొలగిస్తూ ఎల్జీ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. తొలగింపునకు గురైన వారిలో ఆప్ నేత జాస్మిన్ షా, ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా కుమారుడు నవీన్ గుప్తా, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. వారి స్థానంలో సీనియర్ అధికారులను నియమించారు. ప్రభుత్వ నామినీలుగా వారు చట్టవిరుద్ధంగా నియమితులయ్యారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నామినేటెడ్ సభ్యులు ప్రైవేట్ డిస్కమ్‌లకు దాదాపు రూ.8 వేల కోట్లు ప్రయోజనం చేకూర్చిన ఆరోపణలపై ఎల్జీ ఈ ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
