Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సామాన్యుడికి మరో షాక్.. విజయ డెయిరీ పాల ధర పెంపు

ముందే నిత్యవసర సరుకుల ధరలు మండిపోతుంటే పాల ధరలు కూడి దూసుకుపోతున్నాయి. ప్రతి రోజు అవసరమయ్యే పాల ధరలకు రెక్కలొస్తున్నాయి. విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల ధరలను లీటర్‌కు రూ.4 చొప్పున పెంచుతున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.  నిజానికి పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమావేశం నిర్వహించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావించారు.  కానీ అధికారికంగా ఆలాంటి సమావేశమేమీ నిర్వహించకుండానే గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకి వచ్చాయి. అయితే నెలవారీ కార్డులు తీసుకున్న వారికి ఆ పరిమితి ముగిసేంతవకు అంటే సెప్టెంబర్‌ 10, 13  తేదీల వరకు పాత రేట్ల వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ప్రకటించింది

Related Posts

Latest News Updates