విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మరో పాట కోకా 2.0 రిలీజ్ అయ్యింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే డిఫరెంట్ స్టైల్‌లో కనిపించారు. పాట పంజాబీ ఫ్లేవర్‌లో ఉండటంతో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కూడా పంజాబీ లుక్‌లో అదిరిపోయారు. విజయ్ దేవరకొండ తలపాగా, మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ లో కనిపించగా, అనన్య కూడా మెరూన్ లెహంగాలో కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీనుతో పాటు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ మూవీలో కనిపించనున్నారు. ఇది ఈనెల 25న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
