అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC సమావేశం నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు ఈ నెల 16న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన, జోగి రమేష్, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం చీఫ్ విప్ ప్రసాద రాజు మీడియాతో మాట్లాడారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వుంటుందని తెలిపారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలకు సెలువులు వుండవని, శని, ఆదివారాల్లోనూ సభ కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. 21,22 తారీఖుల్లో సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికీ సమాధానం చెప్పేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందన్నారు. నవరత్నాలతో ఏపీ ప్రజలకు డైరెక్టుగా నిధులు అందించామన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్లో ఉందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిందని పేర్కొన్నారు. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు.