ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తు పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, జనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తం 70 అంశాల అజెండాతో కేబినెట్ చర్చించింది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ప్రతిపాదనలను చర్చించి, ఆమోదం తెలిపారు.
ఈ నెల రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుకే కేబినెట్ ఆమోదం
2. ఈ నెల 28 న జగనన్న విద్యాదీవెన చెల్లింపులకు ఆమోదం
3. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
4. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ఆమోదం
5. విశాఖలో టెక్ పార్కు ఏర్పాటుకు ఓకే.
6. నెల్లూరు బ్యారెజ్ ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారెజ్ గా మారుస్తూ నిర్ణయం.
7. రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్ బెర్త్ ల నిర్మాణానికి ఆమోదం
8. లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం
9. పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం.