గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. మూడున్నర సంవత్సరాల పాటు ఏపీకి సేవలందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ గవర్నర్ గా మూడున్నర సంవత్సరాల పాటు బిశ్వభూషణ్ సేవలు చేశారని సీఎం జగన్ అన్నారు.
కాగా… దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనిని రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బిశ్వభూషణ్ స్థానంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను కేంద్రం నియమించింది. ఇక.. బిశ్వభూషణ్ ని ఛత్తీస్ గఢ్ కి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
పలు రాష్టాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గర్నర్లను నియమించింది. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అయితే… ఏపీ గవర్నర్ గా ఇన్ని రోజుల పాటు సేవలందించిన విశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమించారు. విశ్వభూషణ్ స్థానంలో రిటైర్డ్ జడ్జీ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. అదే విధంగా మహారాష్ట్ర గవర్నర్ గా కోషియారీని తప్పించి, రమేశ్ బైస్ ను నియమించింది.
నూతన గవర్నర్ల జాబితా
ఆంధప్రదేశ్ – జస్టిస్ అబ్దుల్ నజీర్
ఛత్తీస్ గఢ్ – విశ్వభూషణ్ హరిచందన్
మహారాష్ట్ర- రమేశ్ బైస్
హిమాచల్ ప్రదేశ్ – శివ ప్రతాప్ శుక్లా
అరుణాచల్ ప్రదేశ్ – కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్
సిక్కిం – లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
జార్ఖండ్ – సీపీ రాధాకృష్ణన్
అసోం – గులాబ్ చంద్ కటారియా
మణిపూర్ – అనసూయ
నాగాలాండ్ – గణేశన్
మేఘాలయ – ఫాగు చౌహాన్
బిహార్- రాజేంద్ర విశ్వనాథ్
లద్దాఖ్ : బీడీ మిశ్రా