కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు.తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపైనే ఇరువురి మధ్య దాదాపు అరగంట పాటు చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై చర్చించామన్నారు. తనతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం జగన్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అంతకు ముందు సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు. ర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.
