నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజవకర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతోనే విజయం సాధించామని జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరులకు, స్పేహితులకు, అవ్వకు, తాతకు ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. 82,888 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఓ రకంగా వైసీపీది ఏకపక్ష విజయమే. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి వైసీపీ అభ్యర్థి ప్రత్యర్థులపై విజయం సాధిస్తూనే వచ్చారు. మొత్తంగా 20 రౌండ్లలో లెక్కింపు జరగగా, ప్రతి రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డిదే ఆధిక్యం.
ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి… ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు! (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022