రాష్ట్రంలోని మహిళలందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిలోనే కాకుండా, డెవలప్ మెంట్ లోనూ మహిళలు కీలక పాత్రే పోషిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన వనిత తన బిడ్డల కోసం చేస్తున్న ఒంటరి పోరాటాన్ని కొనియాడారు. అలా వనిత ఒంటరి పోరాటం చేస్తూ… సమాజానికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. వనితతో పాటు మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం.
వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.#InternationalWomensDay pic.twitter.com/rtRHf3O1pF— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2023
ప్రగతికైనా కీలకమైన కొలమానమని, 2019 లో అధికారం చేపట్టిన నాటి నుంచి తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య లాంటి అంశాలపై చాలా చేస్తోందని చెప్పుకొచ్చారు. మహిళల భద్రత కొరకు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో ఆడబిడ్డల రక్షణ దిగా అడుగులు వేశామన్నారు. 21 వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఏపీలోనే అవతరించేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ, సగభాగం ఇచ్చిందన్నారు.