మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఓ (ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్) కు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. 6 వేల రూపాయల చెల్లింపులై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై మున్సిపల్ కార్మికులకు ఇచ్చే 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓహెచ్ఏ ను కలిపి చెల్లిస్తారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 21 వేలకు పెరిగాయి. దీని ద్వారా 43 వేల మంది కార్మికులకు మేలు జరగనుందని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే వీటి సాధనకై ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెనిర్వహించారు. మంత్రి హామీ ఇవ్వడంతో విరమించిన విషయం తెలిసిందే.
