ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద ఆయన్ను విచారించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పై వ్యాఖ్యలు చేశారు. రఘురామ సీఐడీ విచారణకు హజరు కావాలని, హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌజ్ లో సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని సూచించింది. అంతే తప్ప సీఐడీ కార్యాయాలకు ఆయన్ను పిలిపించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ అంతా లాయర్ సమక్షంలోనే జరగాలని కూడా తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే.. బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.